స్కంద షష్ఠి కవచం
5.0
Android OS
About స్కంద షష్ఠి కవచం
స్కంద షష్టి కవచం రోజువారీ జీవితంలో సురక్షితంగా ఉండటానికి సహాయపడుతుంది.
స్కంద షష్టి కవచం దేవరాయ స్వామిగల్ స్వరపరిచారు. ఇది రోజువారీ జీవితంలో విజయం సాధించడంలో మీకు సహాయపడే విలువైన నిధి. యుద్ధానికి వెళ్ళే యోధుడు తనను తాను రక్షించుకోవడానికి కవచాన్ని ధరించినట్లు, స్కంద షష్టి కవచం కూడా రోజువారీ జీవితంలో సురక్షితంగా ఉండటానికి సహాయపడుతుంది.
Lyrics:
షష్ఠీ కవచము శరవణభవని
శరణాంబుజముల వేడగనే
శిష్ట జనులకు కష్టము తీర్చే
కవచమిదే అని తలచగనే
పార్వతి శివుల ముద్దుల తనయ
దేవసేనాని శ్రీ కార్తికేయ
శరణ కింకిణులు కలకలలాడగ
పాద భక్తులను కావగరాదా
షష్ఠి యందు ఆ శరవణ తటిలో
ఉద్భవించిన మహానుభావా
కరమున భీకర శూలాయుధమును
దాల్చిన దేవా కావగ రావా
శులాయుధకర సుబ్రహ్మణ్య
నెమలి వాహనా భక్తవరేణ్య
ఇలలో దైవం నీవని వేడితి
కావగ రారా శ్రీ సుబ్రహ్మణ్య
రహణ భవస రర రర రరర
రిహణ భవస రిరి రిరి రిరిరి
రినభవ శరహణ వీరా నమో నమో
రిభవ శరవణ నిర నిర నిరన
బీజాక్షర ధర శులాయుధకర
మంత్రస్వరూపా సుందర రూపా
దివిజ మనోహర దేవసుధాకర
పన్నేండ్రాయుధ పాశాంకుశధర
ఆరుశిరసుల మకుటము లలర
ఫాలభాగమున విభూతి మెరయ
కరుణతో మెరిసే చక్కని చూపుల
కావగ రారా సుబ్రహ్మణ్య
సుబ్రహ్మణ్యుని స్మరించువారికి
కుమారస్వామిని కొలిచేవారికి
షష్ఠి కవచము జపించువారికి
శరవణభవుడే నిరతం రక్ష
అరుణాచల నిధి కార్తికేయుడే
జలమునందున సతతం రక్ష
తేజోవలయుడు షణ్ముఖనాధుడు
అగ్ని యందున నిరతం రక్ష
దేవసేనానై నింగిలో వెలిగే
కార్తికేయుడే నింగిలో రక్ష
మనోవేగమున చరించు స్వామి
వాయువులోనా మాకిల రక్ష
పంచభూతముల ఎనిమిది దిక్కుల
ఆ నవగ్రహముల పగలూ రేయలు
శాఖిని ఢాఖిని భూతప్రేతముల
ప్రభావమనచే శూలము రక్ష
షణ్ముఖనాధుని శూలమువంటి
మహిమాన్వితమౌ ఈ కవచమును
శ్రద్ధ భక్తితో స్మరించువారికి
శ్రీ సుబ్రహ్మణ్యుడు శ్రీరామరక్ష
స్కంధానమః షణ్ముఖ నమః
కార్తికేయ హర స్వామీ నమః
కుమారగురవే దేవా నమః
శరవణభవ ఓం మురుగా నమః
వల్లీదేవసేనానీ శరణం లోకనాధజయ
శ్రీగురు శరణం
శరణం శరణం షణ్ముఖ శరణం
శరణం శరణం షణ్ముఖ శరణం
వల్లీదేవసేనానీ శరణం
లోకనాధ జయ శ్రీగురు శరణం
శరణం శరణం షణ్ముఖ శరణం
శరణం శరణం షణ్ముఖ శరణం
What's new in the latest 1.0
స్కంద షష్ఠి కవచం APK Information
Super Fast and Safe Downloading via APKPure App
One-click to install XAPK/APK files on Android!