DevaThilakula
4.1 and up
Android OS
About DevaThilakula
DevaThilakula
1965కు పూర్వం ఎస్సీల మాదిరిగానే తెలికుల కులస్తులు కూడా గతంలో వివక్షను ఎదుర్కొన్నారు. వీరు నెత్తిన నూనె డబ్బా పెట్టుకుని ఎదురుపడితే చాలు... గ్రామస్తులు అశుభంగా భావించేవారు. ఎంత ముఖ్యమైన పని ఉన్నా అడుగు ముందుకు వేసేవారు కాదు. ఇంట్లో కొంత సమయాన్ని గడిపి మళ్లీ రోడెక్కేవారు. అంతేకాదు వీరిని ‘శని’ గ్రహాలనీ, జిడ్డుగాళ్లని హేళన చేసి మాట్లాడేవారు. గాంధీ అప్పట్లో అంటరానివారిని ఏవిధంగా దగ్గరకు చేర్చుకుని వారికి హరిజనులని నామకరణ చేశారో అదే విదంగా హేళనకు గురవుతున్న గాండ్ల కులస్తులను ఓదార్చే విధంగా ‘మై గాంచ్ తేలీ హూ...’ అని చెప్పడం జరిగింది. అయితే సమాజం నుండి వస్తున్న ప్రతిహేళన నూ తెలికుల కులస్తులు ఛాలెంజ్‌గా తీసుకోవడంతో అప్పట్లో నూనె గానుగలు ఆడించే వీరు తమ పిల్లలను బడికి పంపించి చదివించే ప్రయత్నం చేశారు.
ఇక వీరు చేసే వృత్తి ఆధారంగానే వీరిని తెలికుల కులస్తులుగా పిలిచేవారు. గానుగ ఆడించి నూనె తీసి, నూనె వ్యాపారం చేస్తారు కనుక తెలీకులోరు అని పిలిచేవారు. రాష్ర్టంలో వీరి కులాన్ని రాయలసీమ, తెలంగాణ జిల్లాల్లో గాండ్ల అని, కోస్తా జిల్లాల్లో తెలికుల అని పిలుస్తున్నారు. కాపు తెలికుల, తెలగ తెలికుల, దేవ తెలికుల, దేవగాండ్ల, సజ్జనపు తెలికుల అని కూడా వీరు పిలుబడుతున్నారు. అయితే దేవతిలకుల,దేవ గాండ్ల మాత్రం శాఖాహారులు కావడం గమనార్హం. కాగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా పిలవడంతో వీరు వేరే కులస్తులనే భావన సమాజంలో కలగకుండా ఉండేందుకు ఈ కులస్తులు ‘గాండ్ల తెలికుల’ అని చెప్పుకోవడంతో ప్రస్తుతం రాష్ర్ట వ్యాప్తంగా వీరు "అఖిల గాండ్ల తెలికులు"గా గుర్తింపు పొందారు.
What's new in the latest 1.0
DevaThilakula APK Information
Super Fast and Safe Downloading via APKPure App
One-click to install XAPK/APK files on Android!