
Farmers First Foundation Telugu
4.1 and up
Android OS
เกี่ยวกับ Farmers First Foundation Telugu
ทั้งๆ ที่รู้กันดีอยู่แล้วว่า “ชาวนาคือกระดูกสันหลังของเศรษฐกิจประเทศ”
ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్ పరిచయం
భారతీయ రైతుల సర్వతోముఖాభివృద్ధికై నిరంతరం కృషిచేస్తున్న" ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్” ఒక వినూత్నమైన సామాజికసంస్థ. రైతుసమూహాలను సామాజికంగా అభివృద్ధిపథంలో నడిపించడానికి ఫౌండేషన్ ఎల్లవేళలా పనిచేస్తుంది. “దేశ ఆర్ధికవ్యవస్థకి రైతే వెన్నెముక” అన్నది జగమెరిగిన సత్యమే అయినా, భారతదేశంలో రైతులు అన్నిరకాలుగా దగాపడుతున్నారు.
సగానికి పైగా జనాభా జీవనోపాధికోసం వ్యవసాయరంగంపైనే ఆధారపడి ఉన్నా, ప్రభుత్వ విధానాలు మాత్రం రైతులకు స్నేహపూర్వకమైనవిగా ఉండడం లేదు. పెట్టిన పెట్టుబడికి తగిన లాభం పొందలేక, వ్యవసాయరంగాన్ని వదలలేక రైతులు సతమతమౌతున్నారు. అలాంటి రైతులను ఆదుకోవడానికి స్థాపించబడి, స్థాపించిన రోజు నుండి, “ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్” రైతులకు ఉచిత కౌన్సిలింగ్ సేవలు, సాంకేతిక విద్యా విషయాలు, సలహాలు, రైతు దత్తత సేవలు, పెట్టుబడి సహాయ సేవలు, తదితర కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకుసాగుతోంది.
హ్యాపీ ఫార్మింగ్
768
చెట్లు నాటారు
678
లైక్స్
800
వాలంటీర్స్
ఈరోజు ప్రతీ సామాన్యుడు మూడుపూటలా తినగలుగుతున్నాడంటే, రైతులు నిస్వార్ధంగా పొలాల్లో, చేలల్లో చేస్తున్న నిరంతర కృషియే దానికి ప్రధాన కారణం. ఇది అందరికి విదితమే. కానీ, అలాంటి రైతుకి తాను పండించిన పంటకి గిట్టుబాటుధర లభిస్తోందా? తాను ధారపోస్తున్న చెమటకి, వెచ్చిస్తున్న సమయానికి, చేస్తున్న కృషికి, ఇంకా ముఖ్యంగా తాను చేస్తున్న త్యాగాలకి మూల్యం దక్కుతోందా? ఇలాంటి ప్రశ్నలకు జవాబులు లేవనే చెప్పాలి. ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న రైతుల శ్రేయస్సుకోసం నడుం బిగించింది ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్.
ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే, పశ్చిమ ధనికదేశాల్లో, వ్యవసాయరంగం ప్రధానంగా ప్రభుత్వాల ద్వారా ఆర్ధిక సహాయం పొందుతోంది. ఫ్రాన్స్, జపాన్, దక్షిణ కొరియా, నార్వే, ఐస్లాండ్ లాంటి దేశాల్లో, ప్రొడ్యూసర్ (రైతులకు) సహాయం 40 నుండి 60 శాతం వరకు అందుతోంది. ఈ సహాయం అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో 12 శాతంగా మరియు యురోపియన్ యూనియన్ లో 20 శాతంగా ఉంది. కానీ, భారతదేశంలో ఇది చాలా దయనీయ స్థితిలో (-5 శాతంగా) ఉంది. మనం తింటున్న తిండిని పండించడానికి నానాకష్టాలు పడే బీదరైతన్నలే నేడు వ్యవసాయరంగాన్ని నడిపిస్తున్నారు.
What's new in the latest 1.0
ข้อมูล Farmers First Foundation Telugu APK

การดาวน์โหลดที่รวดเร็วและปลอดภัยเป็นพิเศษผ่านแอป APKPure
คลิกเพียงครั้งเดียวเพื่อติดตั้งไฟล์ XAPK/APK บน Android!