關於తెలుగు భాగవతం
Potana的譚dvadasa skandhalaloni美妙詩句,詩句(總9013)
విష్ణుమూర్తి కథలు శుభప్రదమైనవి, అమృతంలా ఉంటాయి; వాటిని ఎన్నిసార్లు విన్నా, ఎప్పటికప్పుడు సరి క్రొత్తగా ఉంటాయి; మన పోతన తెలుగు భాగవతం అలాంటి పవిత్రమైన కథల కాసారం; ఇది భక్తి ప్రపత్తులు, సాహిత్యమే కాకుండా అనేక శాస్త్రీయ, సాంఘిక విషయాలు అసంఖ్యాకంగా ఉన్న ఒక మహా ప్రపంచం; దీని లోని సందేశాన్ని, అనంత విజ్ఞాన విశేషాలను సంపూర్ణంగా, సమగ్రంగా పాత కొత్తల మేలు కలయికగా, అందిస్తున్నాం
పోతన గారి భాగవతంలోని ద్వాదశ స్కంధాలలోని అద్భుతమైన పద్యాలూ, వచనాలూ (మొత్తం 9013) అన్నీ; ఘట్టాలు అనే ఉపశీర్షికలలో మీ ముందు ప్రత్యక్షం అవుతాయి. పద్యాలన్నీఛంధం అనే సాంకేతిక పరికరంతో పరీక్షింపబడ్డాయి; యతి, ప్రాసలు గుర్తింపబడ్డాయి.
అంతేకాదు. ప్రతి పద్యానికీ మూలం, టీకా, భావం కళ్ళారా చదివి, ఆడియో అన్నిటినీ చెవులారా విని, మనసారా ఆనందించవచ్చు. అవునండి, ఆడియో బొత్తం నొక్కండి చాలు భాగవతంలోని పోతన అమృత ధార మీ చెవులలో వర్షిస్తుంది.