Our website uses necessary cookies to enable basic functions and optional cookies to help us to enhance your user experience. Learn more about our cookie policy by clicking "Learn More".
Accept All Only Necessary Cookies

O Telugu Study Bible

Grace Ministries telugu Study Bible jest przygotowany przez Jerzego Roberta Crow.

వ్యాఖ్యాన సహిత పవిత్ర గ్రంథం

వ్యాఖ్యానాలతో రిఫరెన్సులతో కూడినది

ఈ వ్యాఖ్యాన సహిత పవిత్ర గ్రంథానికి (Studiuj Biblię) గ్రేస్ ‌ మినిస్ట్రీస్‌ వారు ప్రచురించిన బైబిలు అనువా దాన్ని (మూడవ ముద్రణ) ఉపయోగించాం. ప్రస్తుతం అందుబాటులో ఉన్న తెలుగు బైబిల్‌ అన ువాదాలన్నిటిలోకీ ఇది మూలానికి దగ్గరగా ఉన్నదీ, సరియైనదీ. అంతేగాక చదవడానికి అన్నివిధాలా అనుకూలంగా ఉండ ే సులభశైలిలో ఉంది. వ్యాఖ్యానాలు చేర్చేందుకు అనువైనది.

అసలు వ్యాఖ్యాన సహితంగా పవిత్ర గ్రంథం ఎందుకు ండాలి? ఎందుకంటే బైబిల్‌ చదివేవారు దాన్ని మరింత బాగ ా అర్థం చేసుకోగలగాలని. మనం దేవుణ్ణి, ఆయన వాక్కునూ బాగా ఎరిగి ఉండడమే మన జీవితాల్లో అతి ప్రాముఖ్యమైన విషయం. అయితే వ్యాఖ్యానం, నోట్సు మొదలైన వాటితో నిమిత ్తం లేకుండానే అర్థం చేసుకోవడం సాధ్యపడదా? నిజానికి బైబిల్లోని కొన్ని భాగాలు చాలా స్పష ్టంగా ఉన్నాయి. బైబిలును చాలా జాగ్రత్తగానూ, ప్రార్థనా పూర్వ కంగానూ, విశ్వాసంతోనూ నేరుగా చదవడంవల్ల దానిలోన ి ఎన్నో విషయాలను చక్కగా అర్థం చేసుకోవచ్చు. అయినా కొన్ని భాగాలు మాత్రం ఎంత స్పష్టంగా ఉన్ నప్పటికీ, చదివేవారు వాటిలో అంతర్లీనంగా ఉన్న ప ాఠాలన్నిటినీ గ్రహించలేకపోవచ్చు. బైబిల్‌ను లోతుగా తరచి అధ్యయనం చేయడంలో అనేక స ంవత్సరాలు గడిపిన పండితులు సాధారణంగా సగటు చదు వరులు గమనించలేని కొన్ని పాఠాలనూ, సత్యాలనూ సూచ ించగలరు. బైబిల్లో కొన్ని భాగాలైతే అర్థం చేసుకోవడం చా లా కష్టం. కొందరు బైబిల్‌ రచయితలు సహితం ఇలా భావించారు (2 పేతురు 1:20; 3:15,16 చూడండి).

బైబిలు దేవుని గ్రంథం. దానిలో ఆయన వెల్లడి చేసిన విషయాలు గంబీరమైనవి, భావగర్భితమైనవి (యెషయా 55:8,9). దేవుని వాక్కుకు ఉత్తమ ఉపదేశకుడు దేవుడే గదా. బైబిల్‌ చదివే ప్రతి వ్యక్తీ అందులోని విషయాల ు తనకు బోధ పడేందుకు దేవుని మీదనే ఎక్కువగా ఆధార పడితే మరింతగా నేర్చుకోగలుగుతాడు. తన సత్యాలను మనుషులకు నేర్పడం దేవునికి ఎంతో ఇ ష్టం. అలా నేర్పించమని వినయంతో మనం ఆయన్ను వేడుకోవా లి (కీర్తన 25:4–9)

కానీ బైబిల్‌ను క్షుణ్ణంగా అర్థం చేసుకోవడంలో ఇతరుల సాయం ఎంతమాత్రం పొందకుండా అందులోనిదంతా సంపూర్ణంగా అర్థం చేసుకోగల స్థితికి మనలో ఎవరు చేరగలం? ఈ వ్యాఖ్యానాలు, వివరణలు రాసిన రచయిత గుర్తించ ిన ఒక సత్యం ఇది – బైబిల్‌ను అర్థంచేసుకోవడానికి బైబిల్‌ చాలు అనుకుంటూ, దేవుడు తన సేవకుల ద్వార ా అందించే సహాయకరమైన సమాచారాన్ని తిరస్కరించేవ ారు చాలామంది విపరీతమైన భావనలకూ, బైబిల్‌ విరుద ్ధమైన ఉద్దేశాలకూ లోనవుతారు. దేవుని వాక్కును అర్థం చేసుకోవడానికి ఇతరులకు సహాయపడిన దైవ సేవకులు అనేకమంది బైబిల్లో కనిపి స్తారు (ఎజ్రా 8:8; అపొ కా 8:28–35). దేవుని సత్యాలను “ఇతరులకు నేర్పగల నమ్మకమైన మన ుషులకు అప్పజెప్పు” అని పౌలు తిమోతిని ఆదేశించా డు(2 తిమోతి 2:2). ఇంకా „దేవుని వాక్కు ప్రకటించు. యుక్తకాలంలో, అకాలంలో సిద్ధంగా ఉండు. నిండు ఓర్పుతో ఉపదేశంతో మందలించు, చీవాట్లు పె ట్టు, హెచ్చరించు” (2 తిమోతి 4:2) అని కూడా అన్నాడు. ఈ స్టడీ బైబిల్లో దీన్నే చేయడానికి ప్రయత్నిం చాం. జాగ్రత్తగా ఉపదేశించడానికీ, పొరపాటు భావనలను సరిదిద్దడానికీ, తప్పుడు మార్గాలనూ క్రియలనూ మం దలించడానికీ సమకట్టాం. దేవుని వాక్కుకు ప్రజలు విధేయత చూపేలా ప్రోత్ సహించడానికీ పూనుకున్నాం.

మేము అందిస్తున్న వ్యాఖ్యానాలు, వివరణలు పరిప ూర్ణం కావనీ, లోపరహితం కావనీ మాకు బాగా తెలుసు. అనేక పొరపాట్లు ఉండి ఉండవచ్చని కూడా భావిస్తు న్నాం. బైబిలు మాత్రమే నిర్దోషమైనది, దైవావేశం వల్ల క లిగినది, ఏ లోపమూ లేనిది, పరిపూర్ణమైనది (2 తిమోతి 3:16,17; 2 పేతురు 1:2; మత్తయి 4:4; 5:18). మేము ఇందులో ఇచ్చిన వ్యాఖ్యానాలు, నోట్సు దేవు ని నోటనుండి వచ్చినవి కావు, దైవావేశం వల్ల కలిగి న లేఖనాలవంటివి కావు. మేము ఇందులో ఇచ్చిన వ్యాఖ్యానాలు, నోట్సు ప్రా ర్థన పూర్వకంగా చదువుతూ రాస్తూ ఉన్నా, ఏ తప్పు చ ేయకూడదని ఎంత ప్రయాసపడినా కూడా, వివరించడంలో అక ్కడక్కడ కొన్ని తప్పులు చేసివుండవచ్చు. అందువల్ల జాగ్రత్తగా వాటిని పరీక్షించి సారాం శాన్ని గ్రహించాలే గాని, మేము వ్రాసిన ప్రతిదీ దైవవాక్కు అయినట్టు తీసుకోకూడదు. (1 తెస్స 5:21 చూడండి). ఈ వ్యాఖ్యానాల నుండి నేర్చుకోగలిగిన దాన్ని న ేర్చుకోవడానికీ, దేవుని వాక్కుకు విరుద్ధంగా ఉన ్నట్టు రుజువైతే దాన్ని తిరస్కరించడానికీ చదు వరులు సిద్ధపడి ఉండాలి.

బైబిలును అర్థం చేసుకోవడానికీ దేవుని ఆత్మ అం దించే సహాయం తీసుకోవడం చాలా ముఖ్యం (1 కొరింతు 2:10–14). దీనిని మీరు ధ్యానించేటప్పుడు దేవుని ఆత్మతో నిండి, ఆయనపై ఆధారపడండి.

Co nowego w najnowszej wersji 7.6.18

Last updated on Oct 21, 2023

Minor bug fixes and improvements. Install or update to the newest version to check it out!

Tłumaczenie Wczytuję...

Dodatkowe informacje APLIKACJA

Ostatnia Wersja

Dostępne Telugu Study Bible aktualizacje 7.6.18

Przesłane przez

Yoseph Ramírez

Wymaga Androida

Android 4.4+

Available on

Pobierz Telugu Study Bible z Google Play

Pokaż więcej

Telugu Study Bible Zrzuty ekranu

Wczytywanie komentarzy...
Języki
Subskrybuj APKPure
Bądź pierwszym, który uzyskał dostęp do wczesnego wydania, wiadomości i przewodników najlepszych gier i aplikacji na Androida.
Nie, dziękuję
Zapisać się
Subskrybowano pomyślnie!
Jesteś teraz subskrybowany do APKPure.
Subskrybuj APKPure
Bądź pierwszym, który uzyskał dostęp do wczesnego wydania, wiadomości i przewodników najlepszych gier i aplikacji na Androida.
Nie, dziękuję
Zapisać się
Powodzenie!
Jesteś teraz subskrybowany do naszego biuletynu.