గీత కార్మికులకు మరియు కల్లు సేవించేవారికి వారదిగా ఇకపై గౌడ్ సాబ్ అన్ లైన్ యాప్.
గీత కార్మికులకు మరియు కల్లు సేవించేవారికి వారదిగా ఇకపై గౌడ్ సాబ్ అను అన్ లైన్ యాప్ అందుబాటులోకి రానుంది. గౌడ యువకుల వినూత్న ఆలోచనలతో రూపుదిద్దుకుంది. ఈ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ రోజుల్లో అందరూ ఆండ్రాయిడ్ మొబైల్ వాడటం మరియు సులువుగా వారు కోరుకున్న సమాచారం పొందడం వివిధ యాప్ ల ద్వారా జరుగుతుంది ఇందులో భాగంగానే కల్లు గీత కార్మికుల పూర్తి సమాచారం ఇందులో నిక్షిప్తం చేయబోతున్నారు, పట్టణాలలో నివసించే వారు మరియు ఒక ప్రాంతం నుండి ఇంకొక కొత్త ప్రాంతానికి ఎవరైనా వచ్చినప్పుడు వారికి ఆ స్థానిక ప్రదేశంలో ఉన్న కల్లు గీసే గౌడన్న సమాచారం మరియు అతని దగ్గర తాటి కల్లు ఉందా ఈత కల్లు ఉందా అనే సమాచారం తెలుసుకోవడంతో పాటు ముందస్తుగా బుకింగ్ చేసుకునే అవకాశం ఈ యాప్ ద్వారా కలుగుతుంది దీనితో పాటు తినడానికి చిరుతిండి, తాటి ముంజలు, ఈత పండ్లు, నీర డెలివరీ ఆప్షన్ ద్వారా మనం కోరుకున్న ప్రదేశానికి తెప్పించుకునే వెసులుబాటు ఈ యాప్ ద్వారా మనకు కలుగుతుంది. మరియు కల్లు యొక్క నాణ్యతను వినియోగదారులకు తెలపడానికి గౌడ్ సాబ్ యాప్ రేటింగ్ రూపంలో తెలియజేస్తుంది. ఈ యాప్ పూర్తిగా లొకేషన్ ఆదారంగా పనిచేస్తుంది. ఈ యాప్ ద్వారా గీత కార్మికులకు మరియు కల్లు సేవించేవారికి ఉపయోగకరంగా ఉంటుంది. నీర డెలివరీ ద్వారా కొంతమంది యువకులకు ఉపాధి అవకాశం కలుగుతుంది.