MTRS Party
4.0.3 and up
Android OS
About MTRS Party
తెలంగాణ గడ్డపై మన తెలంగాణ రాష్ట్ర సమఖ్య(ఎంటీఆర్ఎస్)పార్టీ ఆవిర్భవించింది.
తెలంగాణ గడ్డపై మరో రాజకీయ పార్టీ పురుడుపోసుకుంది. మన తెలంగాణ రాష్ట్ర సమఖ్య (ఎంటీఆర్ఎస్) పార్టీ ఆవిర్భవించింది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా మన తెలంగాణ రాష్ట్ర సమఖ్య పార్టీని స్థాపించినట్టు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌చంద్ర పోతు తెలిపారు. హైదరాబాద్‌లో మన తెలంగాణ రాష్ట్ర సమఖ్య పార్టీ ఆవిర్భవ సభ జరిగింది. పార్టీని ప్రకటించిన అనంతరం మెరూన్ కలర్‌తో పార్టీ జెండాను అధ్యక్షుడు అశోక్‌చంద్ర పోతు ఆవిష్కరించారు.
తెలంగాణ గడ్డపై త్వరలోనే రాజకీయంగా పెను సంచలనం సృష్టించబోతున్నామని, ప్రజలంతా హర్షించే భారీ చర్యకు దిగబోతున్నామని ఎంటీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌చంద్ర పోతు ఈ సందర్భంగా తెలిపారు. ఆ సంచలనం ఏంటో అందరు చూడబోతున్నారని తమ పార్టీ ప్రయత్నానికి ప్రజలంతా నీరజనాలు పడతారని ఆయన చెప్పారు.
దేశంలోనే తొలిసారిగా తాము 1000 హామీలతో మేనిఫెస్టో విడుదల చేయబోతున్నామని అశోక్‌చంద్ర పోతు తెలిపారు. సరికొత్త పాలన వ్యవస్థ కోసం తమ పార్టీ భారీ ప్రణాళికతో ఉందని చెప్పారు. తమ పార్టీ లక్ష్యాలు, ఎజెండా తెలుపుతూ త్వరలోనే లక్షా మందితో భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయబోతున్నట్టు ఆయన ప్రకటించారు. తెలంగాణ ప్రజల కండ్లల్ల ఇంకా కన్నీళ్లే ఉన్నయని, తమ పార్టీ ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ కళ్లలో ఆనందం తెచ్చేందుకు కృషి చేస్తుందని తెలిపారు. తెలంగాణ బిడ్డ ఇకపై కూడా దగా పడకూడదనే లక్ష్యంతోనే తాము ఈ పార్టీని ఏర్పాటు చేశామన్నారు.
తెలంగాణలో దోపిడీలు, దౌర్జన్యాలు, దగా, మోసాలు లేని సమాజ నిర్మాణం కోసం తమ పార్టీ పనిచేస్తుందని ఎంటీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ యాదవ్ చెప్పారు. సామాజిక న్యాయం, కుల వివక్షతను రూపుమాపడంతో పాటు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని ప్రకటించారు. రాబోవు సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని నియోజక వర్గాల నుంచి తమ పార్టీ అభ్యర్ధులు పోటీ చేస్తారని తెలిపారు. అధికారానికి దూరంగా ఉన్న అట్టడుగు వర్గాలకు రాజ్యధికారం, యువతకు ఉపాధి, చట్టసభల్లో సబ్బండ వర్గాలకు వాటా కోసం పోరాటం చేస్తామని వారు తెలిపారు.
మన తెలంగాణ రాష్ట్ర సమఖ్య పార్టీ ఆవిర్భావ సభలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ చంద్ర పోతు, వర్కింగ్ ప్రెసిడెంట్ బాస రమేష్ యాదవ్, పార్టీ ప్రణాళిక కమిటీ చైర్మెన్ కొక్కుల భాస్కర్, ప్రధాన కార్యదర్శి మాసం రత్నాకర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంకం శ్రీనివాస్, కోశాదికారి నరేంద్ర.. రాష్ట్ర స్థాయి నాయకులు పాల్గొన్నారు.
What's new in the latest 1.0
MTRS Party APK Information
Super Fast and Safe Downloading via APKPure App
One-click to install XAPK/APK files on Android!